సుక్కూ విషయంలో బన్నీ అసంతృప్తా.. వ్వాట్టే జోక్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప2. బ్లాక్ బస్టర్ పుష్ప1కు సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమా మీద ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతుంది. పుష్ప2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి రోజుకో వార్త నెట్టింట వినిపిస్తోంది. వాస్తవానికి పుష్ప2 ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో సినిమాను ఆగస్ట్ నుంచి డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు.
అయితే దీనికంతటికీ కారణం సుకుమారేనని, ఆయన వల్లే పుష్ప2 రిలీజ్ లేటవుతుందని, ఈ క్రమంలో సుక్కూ పనితీరుతో బన్నీ కూడా విసిగిపోయి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడని నెట్టింట పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని బన్నీ, సుకుమార్ బాండింగ్ గురించి తెలిసిన వారెవరూ ఈ పుకార్లను నమ్మరని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో మూడు సినిమాలొచ్చాయి. సుక్కూ పర్ఫెక్షన్ గురించి బన్నీ కంటే ఎక్కువగా మరెవరికీ తెలియదు. అలాంటప్పుడు సుక్కూ విషయంలో బన్నీ అసంతృప్తి వ్యక్తపరిచే ఛాన్సే లేదని, ఇవన్నీ కేవలం కల్పిత వార్తలేనని ఫ్యాన్స్ అంటున్నారు.













