Peddi: పెద్ది గ్లింప్స్ రూమర్లపై క్లారిటీ
ఉప్పెన(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సాన(Buchibabu Sana)దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది(Peddi). ఈ మూవీపై అందరికీ ముందు నుంచి తారా స్థాయిలో అంచనాలున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పెద్ది నుంచి శ్రీ రామనవమి సందర్భంగా మేకర్స్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.
ఈ గ్లింప్స్ పై తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ గ్లింప్స్ ను డైరెక్టర్ చాలా బాగా కట్ చేయించాడని, రిలీజయ్యాక అందరూ చాలా కాలం పాటూ దీని గురించే మాట్లాడుకుంటారని తెగ చెప్పుకుంటున్నారు. గ్లింప్స్ కట్ బావున్నప్పటికీ దానికి రెహమాన్(Rahman) సరైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదనే రూమర్లు వినిపిస్తున్నాయి.
రెహమాన్ బీజీఎం విషయంలో వస్తున్న ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవని చిత్ర యూనిట్ చెప్తోంది. దీని కోసం రెహమాన్ చాలా స్పెషల్ గా క్రేజీ సౌండింగ్ ను రెడీ చేశాడని అంటున్నారు. ఏప్రిల్ 6న గ్లింప్స్ రిలీజయ్యాక అందరికీ ఈ విషయంలో ఉన్న అనుమానాలు తొలగిపోతాయంటున్నారు. ఇంకా చెప్పాలంటే గ్లింప్స్ కు రెహమాన్ ఇచ్చిన బీజీఎం హైలైట్ గా నిలుస్తుందని కూడా వారు చెప్తున్నారు. వీలైనంత త్వరగా పెద్ది షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.













