గుంటూరు కారం రిలీజ్ వరకు ఇబ్బందులు తప్పేలా లేవు
సంక్రాంతికి రానున్న గుంటూరు కారం పై ఎన్నో అంచనాలున్నాయి. మరో 20 రోజుల్లో రానున్న ఈ సినిమా ను చెప్పిన డేట్‌కి రిలీజ్ చేయడానికి టీమ్ తెగ పరుగులు పెడుతోంది. మూడు సాంగ్స్ షూటింగ్ అయిపోయింది. మరో సాంగ్ బ్యాలెన్స్ ఉంది. పక్కా మాస్ బీట్ తో సాగనున్న ఈ పాటతో మరో హీరోయిన్ తో స్టెప్పులేయించాలని చూస్తున్నారు మేకర్స్.
అయితే ఓ మై బేబీ సాంగ్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ తో మహేష్ చాలా కోపంగా ఉన్నాడని, అందుకే లాస్ట్ సాంగ్ అవుట్‌పుట్ పై శాటిస్ఫై అవకుండా, మళ్లీ చేసుకుని రమ్మని షూటింగ్ ఆపేశాడని నెట్టింట వార్త రాగా, ఈ విషయంలో నాగ వంశీ స్వయంగా స్పందించి, ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చాడు. గుంటూరు కారం విషయంలో వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని, 21 నుంచి షూటింగ్ ఉంటుందని క్లారిటీగా చెప్పాడు.
దీంతో మరో 20 రోజుల్లో షూటింగ్ పెట్టుకుని ఇంకా సాంగ్ ఫైనల్ కాలేదని చెప్పడం, షూటింగ్ కాలేదని చెప్పడమేంటని ఫ్యాన్స్ ఓ వైపున నిరాశ పడుతున్నప్పటికీ, గుంటూరు కారం మెయిన్ కంటెంట్ బాగా వచ్చందని తెలిసి మరోవైపు హ్యాపీగా ఫీలవుతున్నారు. పోకిరి తర్వాత మహేష్ బాబు ఆ రేంజ్ లో చేస్తున్న మాస్ సినిమా కావడంతో గుంటూరు కారంపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఏదేమైనా గుంటూరు కారం రిలీజయ్యే వరకు ఏదొక రూపంలో ఇబ్బందులు తప్పేలా లేవు.













