RC16: రెహమాన్ విషయంలో వస్తున్నవన్నీ రూమర్లే!
సోషల్ మీడియాలో ఏదైనా వార్త రావడం ఆలస్యం. అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఆర్సీ16(RC16) గురించి కూడా అలాంటి ఓ రూమర్ నెట్టింట ప్రచారమవుతుంది. ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) తప్పుకున్నారనే వార్త ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ను కంగారు పుట్టిస్తుంది. ఇప్పుడిప్పుడే షూటింగ్ ఫుల్ టైమ్ లో జరుపుకుంటున్న ఆర్సీ16 గురించి ఈ వార్త విని చరణ్(Ram Charan) ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
కానీ యూనిట్ వర్గాల ప్రకారం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. రెహమాన్ ప్లేస్ లోకి దేవీ శ్రీ(Devi Sri Prasad) వస్తున్నాడనేది రూమర్ మాత్రమేనని, ఇప్పటికే రెహమాన్ ఈ సినిమా కోసం మూడు పాటలు రికార్డ్ కూడా చేశాడని, ఇలా రెహమాన్ సగంలో సినిమాను వదిలేయడని అంటున్నారు. సగం ఆల్బమ్ తన పేరు, మిగిలిన సగం ఇంకొకరి పేరు వేసే ఆప్షన్ ను రెహమాన్ ఎప్పుడూ తీసుకోడు.
దానికి తోడు బుచ్చిబాబు(Buchibabu) చెప్పిన కథ విపరీతంగా నచ్చేసిందని రెహమాన్ ఇప్పటికే చెప్పాడు కాబట్టి తప్పుకునే ఛాన్స్ అసలు ఉండదు. ఆర్సీ16ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది దసరాకే రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తుంది. జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఆల్మోస్ట్ ఫిక్స్ చేసినట్టే.













