23న వస్తున్న రూల్
శివమణి, సోనా పటేల్ జంటగా నటించిన చిత్రం రూల్. ది పవర్ ఆఫ్ పీపుల్ అనేది ఉప శీర్షిక. పైడి రమేష్ దర్శకుడు. పి.సూర్యనారాయణ నిర్మాత. రమణసాయి స్వరకర్త. చిత్రం విడుదలకి సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో చిత్ర బృందం మీడియాతో మాట్లాడింది. దర్శకుడు మాట్లాడుతూ తన కుటుంబానికి జరిగిన అన్యాయం ఇతరులకు జరగకూడదని ఆదర్శవంతమైన యువ నాయకుడిగా ఎదిగిన ఓ యువకుడి కథ ఇదన్నారు. 23న విడుదల చేస్తున్నామన్నారు నిర్మాత. కథానాయకుడు మాట్లాడుతూ మంచి కథా చిత్రం ద్వారా పరిచయం కావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సోనా పటేల్, రత్నాకర్, కృష్ణమోహన్ రెడ్డి, మాస్టర్ ప్రేమ్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.













