రుక్మిణి… మరో రష్మిక అవుతుందా?
సౌత్‌లో కన్నడ బ్యూటీలు పూజా హెగ్డే, రష్మిక ఎంత క్రేజ్ సంపాదించారో తెలిసిందే. ప్రస్తుతం పూజా హెగ్డే ను వరుస ఫ్లాపులు వేధిస్తున్నాయి. కానీ రష్మిక మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంటున్న రష్మిక, రీసెంట్ గా యానిమల్ మూవీతో మంచి హిట్ అందుకుంది.
ఇప్పుడు మరో భామ కన్నడ నుంచి తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది. తెలుగు, తమిళ చిత్రసీమల్లో మెల్లమెల్లిగా అవకాశాలు అందుకుంటుంది. సప్త సాగరాలు దాటి సినిమాతో పాపులర్ అయిన రుక్మిణీ వసంత్‌కు ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. రెండు భాగాలుగా రిలీజైన ఈ సినిమా మిక్డ్స్ టాక్ సంపాదించుకుంది.
ఫస్ట్ పార్ట్ రిలీజయ్యాకే రుక్మిణిని చాలా మంది మేకర్స్ సంప్రదించారు. కానీ సెకండ్ పార్ట్ రిలీజయ్యే వరకు ఆమె ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లేదు. ఇప్పుడు సెకండ్ పార్ట్ తర్వాత అమ్మడుకి మంచి ఛాన్సులొస్తున్నాయి. తమిళం, తెలుగు భాషల దర్శక నిర్మాతలు ఆమె వెంట పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి తో ఓ సినిమాకు సైన్ చేసిన రుక్మిణి వసంత్, శివ కార్తికేయన్ హీరోగా మరో సినిమాను ఓకే చేసింది. తెలుగులో విజయ్ దేవరకొండ సినిమా కోసం కూడా అమ్మడు పేరు పరిశీలనలో ఉంది. రవితేజ మూవీ కోసం కూడా రుక్మిణిని అనుకుంటున్నారట. చూస్తుంటే రుక్మిణి కూడా రష్మికలానే పాపులర్ అవుతుందేమోనని అందరూ అనుకుంటున్నారు.













