Rukmini Vasanth: భారీ ఆఫర్లతో రుక్మిణి
బీర్బల్ ట్రయాలజీ(Birbal Trailogy) మూవీతో కెరీర్ ను మొదలుపెట్టిన కన్నడ భామ రుక్మిణీ వసంత్(Rukmini Vasanth), ఆ తర్వాత బాలీవుడ్ లో అప్స్టార్ట్స్(Upstarts) లో నటించింది. కానీ అమ్మడికి బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం సప్త సాగరాలు దాటి(Sapta sagaralu daati) మూవీనే. ఆ సినిమాతో రుక్మిణికి నటిగా మంచి గుర్తింపు తో పాటూ ఎన్నో అవకాశాలను, అవార్డులను కూడా తెచ్చి పెట్టింది.
ఆ తర్వాత దానికి సీక్వెల్ లో నటించి మరింత గుర్తింపు, క్రేజ్ ను తెచ్చుకున్న రుక్మిణి, యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(nikhil Sidhardh) తో కలిసి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో టాలవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కానీ ఆ సినిమాతో ఫ్లాపు ను ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వంలో శివ కార్తికేయన్(Siva Karthikeyan) కు జోడీగా మదరాసి(Madarasi) సినిమాలో నటించిన రుక్మిణి చేతిలో ఇప్పుడు రెండు భారీ ప్రాజెక్టులున్నాయి.
అందులో ఒకటి ఎన్టీఆర్(NTR) హీరోగా ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్నీల్(NTRNeel) ప్రాజెక్టు కాగా మరోటి కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్(Chiyan Vikram) దర్శకత్వంలో 96 ఫేమ్ ప్రేమ్ కుమార్(Prem Kumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన డిస్కషన్స్ పూర్తయ్యాయని, త్వరలోనే మేకర్స్ వాటిని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని టాక్. ఈ రెండు సినిమాలూ హిట్టైతే మాత్రం రుక్మిణి సౌత్ లో చక్రం తిప్పడం ఖాయమే అని చెప్పాలి.







