Rukmini Vasanth: ఆ ఫీలింగ్ ను మాటల్లో చెప్పలేను

సప్త సాగరాలు దాటి(sapta sagaralu daati) ఫ్రాంచైజ్ సినిమాలతో మంచి పాపులారిటీని అందుకున్న రుక్మిణి వసంత్(rukmini vasanth) ఆ తర్వాత ఏస్(Ace), బఘీర(Bagheera) లాంటి సినిమాలతో ఆడియన్స్ ను మెప్పించింది. రీసెంట్ గా తమిళంలో శివ కార్తికేయన్(Siva Karthikeyan) తో కలిసి మదరాసి(madarasi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రుక్మిణి ఆ సినిమాలో తన నటనకు మంచి మార్కులే వేసుకుంది.
అక్టోబర్ 2న కాంతార చాప్టర్1(kanthara chapter1) సినిమాతో మరో సారి ప్రేక్షకుల ముందుకు రానున్న రుక్మిణి ఈ సినిమా ఛాన్స్ గురించి మాట్లాడింది. తాను చేసిన సప్తసాగరాలు, ఏస్ మూవీస్ ను రిషబ్(rishab shetty) చూశారని, ప్రీమియర్స్ కు వచ్చి తన యాక్టింగ్ ను మెచ్చుకున్నారని చెప్పింది. కాంతార1లో నటించే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదని రుక్మిణి ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
కాంతార టీమ్ కాల్ చేసి ఈ సినిమాలో నటిస్తారా అని అడిగినప్పుడు వచ్చిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని, ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధంలో ట్రైనింగ్ తీసుకోవడం ఎంతో బాగా అనిపించిందని, ఈ సినిమాలో తాను కొన్ని యాక్షన్ సీన్స్ ను కూడా చేసినట్టు ఆమె చెప్పింది. ఇక షూటింగ్ టైమ్ లో రిషబ్ ను చూసి కొన్ని సార్లు తాను ఆశ్చర్యపోయానని రుక్మిణి తెలిపింది.