Ruhani Sharma: చీరకట్టులో ఎంతో అందంగా రుహానీ

చిలసౌ(Chilasow) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రుహానీ శర్మ(Ruhani Sharma) మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు వేసుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన రుహానీ శర్మకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన అందాల ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే రుహానీ శర్మ తాజాగా చీరకట్టులో మెరిసింది. ఈ ఫోటోల్లో రుహానీ ఎంతో చూడముచ్చటగా, మరింత అందంగా కనిపించింది. సింపుల్ లుక్స్ లో ఎంతో అందంగా కనిపిస్తున్న రుహానీని చూసి అమ్మడికి మరిన్ని అవకాశాలు దక్కాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.