మీకు పెళ్లయ్యిందా?
డాక్టర్ అళహరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఆర్ యు మ్యారీడ్. మౌర్య, చరిష్మా, శ్రీకర్, వెంకట్రాజు, అవంతిక హీరోహీరోయిన్లు. జయసూర్య సంగీతం సమకూర్చిన ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమం ఘనంగా జరింది. ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్ల చేతుల మీదుగా ఆడియో విడుదల చేశారు. డాక్టర్ ఆళహరి దర్శకనిర్మాతగా రూపొందుతున్న ఆర్ యు మ్యారీడ్ చిత్రానికి జయసూర్య సమకూర్చిన బాణీలు చాలా బాగున్నాయని, సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నామని అన్నారు. దర్శకనిర్మాత డాక్టర్ అళహరి మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించిన మౌర్య, చరిష్మా, శ్రీకర్, వెంకట్ రాజ్, అవంతిక తదితరులు మంచి పేరు వస్తుందని, జయసూర్య సంగీతం ఈ చిత్రానికి ముఖ్య అకర్షణగా నిలుస్తుందని అన్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఆర్ యు మ్యారీడ్ చిత్రం మంచి హిట్టయి, తమ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని హీరోహీరోయిన్లు తెలిపారు.













