ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2.. ట్రైలర్ లతో తేలనున్న రేంజ్
ఈ మధ్య సినిమా క్రేజ్ ను డిసైడ్ చేస్తుంది డిజిటల్ లైక్ లు, వ్యూస్. వీటిని బట్టే ఏ హీరోకి ఎంత క్రేజున్నదో బేరీజు వేస్తున్నారు. కానీ అన్నీ సందర్భాల్లో ఇది వర్కవుట్ అవదు. ఒక్కోసారి అందులో కంటెంట్, టైమింగ్ ను బట్టి క్రేజ్ మారుతుంటుంది. వేరే భాషల్లో ఆయా సినిమాలకు వచ్చే పాపులారిటీని బట్టి ఈ క్రేజ్ ఉంటుంది.
ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్, ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న కేజీఎఫ్2కు సౌత్ తో పాటూ, నార్త్ లోనూ భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. ఈ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా సౌత్ తో పాటు, నార్త్ కూడా భాగమైంది. ఇప్పటి వరకు ఈ సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు వచ్చాయి. వాటికి ప్రేక్షకాదరణ కూడా బాగా దక్కింది. కానీ ఏ సినిమాకు ఆ సినిమాకు దేనికదే మంచి ఆదరణే దక్కించుకున్నాయి.
ఈ సినిమాలకు గట్టి పోటీ ఇప్పటికే మొదలైంది. బుక్ మై షో సైట్ లో లైక్ లను చూస్తే కేజీఎఫ్2కు 300కె లైక్ లతో ఆర్ఆర్ఆర్ ను బీట్ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా కంటే 65.6కె లైక్ లు కెజీఎఫ్2కు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ ఒక్క దానితో సినిమా హైప్ ను అంచనా వేయలేం. కేవలం ఇది ఒక యాంగిల్ మాత్రమే. తెలుగ రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ హైప్ ఎక్కువుంటే, మిగిలిన రాష్ట్రాలన్నింటిలో కెజీఎఫ్2కు హైప్ ఎక్కువుందా అనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి ఆర్ఆర్ఆర్, కెజీఎఫ్2 టీజర్లు రెండు కూడా 40 మిలియన్ల కు పైగా వ్యూస్ కలిగి ఉండటమంటే రికార్డనే చెప్పాలి. కానీ ప్రశాంత్ నీల్ కంటే రాజమౌళి సినిమా నుంచే జనాలు ఎక్కువ ఆశిస్తారు. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా జరుగుతున్నట్లనిపిస్తుంది. ఇక అసలు విషయానికొస్తే ఈ రెండు ట్రైలర్లు ఈ విషయాన్ని డిసైడ్ చేస్తాయని ఫీలవుతున్నారు నెటిజన్లు. ఈ రెండు సినిమాలూ చాలా విభిన్నమైన జానర్ లో తెరకెక్కుతున్న సినిమాలు. ప్రస్తుతానికి ఆర్ఆర్ఆర్ హైప్ తక్కువైనా సరే, రిలీజ్ నాటికి అది పెరిగే ఎత్తులు జక్కన్న చాలానే వేస్తాడు. కాబట్టి ప్రతీ విషయం ట్రైలర్లతో మారనుందని భావిస్తున్నారంతా.













