US అన్ని కేంద్రాల్లో హాలీవుడ్ మూవీ రేంజ్ లో జనవరి 6న RRR ప్రిమియర్ : థియేటర్స్ కంఫర్మ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ . ఎంటైర్ ఇండియా ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూస్తోంది. పాన్ ఇండియా లెవల్లోనే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్‌లో 10 భాషల్లో వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 7న సినిమా విడుదలవుతుంది. ముఖ్యంగా ఈ చిత్రం హాలీవుడ్ మూవీ లెవల్లో బిగ్ పోస్టర్ న్యూ యార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో డిస్ ప్లే కావడం విశేషం. అమెరికాలో భారీగా జనవరి 6న ప్రీమియర్ షో తో విడుదల అవుతున్న ఆర్ ఆర్ ఆర్ థియేటర్ లిస్ట్ వచ్చేసింది. ఈ నెల 20 నుండి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు.
ఇందులో రామ్‌చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజుగా నటిస్తుంటే.. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. చరిత్రలో కలుసుకోని ఇద్దరు యోధులు కలుసుకుంటే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ పాయింట్‌తో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాను తె రకెక్కించారు. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా కొమురం భీమ్ పోస్టర్‌ను అల్లూరి సీతా రామరాజు పోస్టర్స్ ని విడుదలచేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి, ఒలివియా మోరిస్ వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. బాహుబలితో తెలుగు సినిమా రేంజ్‌ను ఇండియాకే కాదు.. ప్రపంచానికి చాటిన డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలతో సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నాలుగు వందల కోట్ల రూపాయలతో సినిమాను నిర్మించారు.
యు యస్ బిజినెస్ కోసం
చందు :+1(518)709-3009, తేజు : +918247602526, సాధిక్ : +1(225)563-4242 ను సంప్రదించగలరు.
Click here for RRR Movie US Theaters List