మార్చి 27న తారక్, చెర్రీల ఫ్యాన్స్ సెలబ్రేషన్స్..
ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ అనే భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాజమౌళి ఈ సినిమాను ఎంతో అద్భుతమైన కావ్యంలో మలుస్తున్నారని ఇప్పటికే అర్థమవుతుంది. అక్టోబర్ 13న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీనికంటే ముందే ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్స్ ని ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ స్టార్ట్ చేస్తున్నారు.
మార్చి 27న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి ఒక పోస్టర్ తో పాటు అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుంది. దీంతో సంబంధం లేకుండా అదే రోజున ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ లో మగధీర స్పెషల్ షో వేసేందుకు ఫ్యాన్స్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదిలా ఉంటే అదే రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆది సినిమా 19వ వార్షికోత్సవం సందర్భంగా ఆ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసుకుని హంగామా చేయనున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సుదర్శన్ లో ఈ షో ప్లాన్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
ఒకే రోజు రెండు భారీ ఈవెంట్ల తో క్రాస్ రోడ్స్ ట్రాఫిక్ జామ్ కానుందని అంచనా. తారక్, చెర్రీ అభిమానులతో జంక్షన్ లో హంగామా ఒక రేంజ్ లో ఉండనుందని, ఇప్పటికే ఈ షో లకు సంబంధించిన టికెట్స్ కూడా అమ్ముడయ్యాయి. ఈ సెలబ్రేషన్స్ ను ఇటు చరణ్ ఫ్యాన్స్, అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఘనంగా జరుపుకోనున్నారు.













