ఎన్టీఆర్ బర్త్ డే కు ఆర్ఆర్ఆర్ నుంచి సర్ ప్రైజ్ ఏంటంటే..
వారం రోజుల్లో చరణ్ బర్త్ డే రానున్న నేపథ్యంలో, ఫ్యాన్స్ అంతా రాజమౌళి వైపు చూస్తున్నారు. గతేడాది చరణ్ పుట్టిన రోజు కానుకగా కొమరం భీమ్ వాయిస్ తో సీతారామరాజు ను పరిచయం చేశాడు జక్కన్న. మరి ఈ ఇయర్ చరణ్ బర్త్ డే కు ఫ్యాన్స్ కు జక్కన్న ఇచ్చే గిఫ్ట్ ఏంటి అనే దాని కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్న తరుణంలో పుట్టినరోజు నాడు పోస్టర్ ను రిలీజ్ చేస్తామంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ అనౌన్స్ చేసింది. గతేడాదే వీడియో రూపంలో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసిన టీమ్, ఈ సారి కూడా ఏదొక టీజర్ లాంటిది రిలీజ్ చేస్తారనుకుంటే జస్ట్ పోస్టర్ అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసింది.
కేవలం చరణ్ బర్త్ డే కు మాత్రమే కాకుండా తర్వాత మే 20న తారక్ బర్త్ డే కు కూడా జక్కన్న టీమ్ సర్ ప్రైజ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ సర్ ప్రైజ్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సర్ ప్రైజ్ రానుందో అనుకున్న ఫ్యాన్స్ కు చరణ్ బర్త్ డే గిఫ్ట్ తో ఆ సస్పెన్స్ వీడిపోయింది. ఎందుకంటే చరణ్ బర్త్ డే సందర్భంగా ఏదైతే రిలీజ్ చేస్తారో, అలాంటిదే ఎన్టీఆర్ బర్త్ డే కు కూడా రిలీజ్ చేస్తారు. అంటే ఎన్టీఆర్ బర్త్ డే కు కూడా పోస్టరే రిలీజ్ చేయనున్నారన్నమాట. అయితే ఇప్పటికే వీరిద్దరికీ సంబంధించిన లుక్స్ వచ్చేశాయి కాబట్టి ఇప్పుడు జక్కన్న స్పెషల్ గా ఏం రిలీజ్ చేస్తాడో చూడాలి.













