నాలుగవ స్థానంలో RRR ..
వరల్డ్ ఫేమస్ పాన్ ఇండియా మూవీ RRR ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ సినిమా చాలా పేరుని సంపాదించిన విషయం తెలిసిందే. ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న RRR గూగుల్ ట్రెండ్ లో మాత్రం నాలుగవ స్థానంలో నిలిచింది. ప్రతి సంవత్సరం ట్రెండ్ అయిన సినిమాలని లిస్ట్ అవుట్ చేస్తుంది గూగుల్.
ఇయర్ ఎండింగ్ కావడంతో ప్రతి ఏడాది లాగానే గూగుల్ ట్రెండ్ లో ఉన్న సినిమాల లిస్ట్ ని ప్రకటించింది గూగుల్. ఈ నేపథ్యంలో ఒక్కో సినిమాకి ఒక్కో ప్లేస్ దక్కింది. మొదటి స్థానంలో ‘ బ్రహ్మాస్త్రం ‘ నిలిచింది. రెండవ స్థానం ‘ కెజిఫ్ 2 ‘ దక్కించుకోగా, ‘ ది కాశ్మీర్ ఫైల్స్ ‘ 3 వ ప్లేస్ లో నిలిచింది. ఇక వరల్డ్ ఫేమస్ అయిన RRR మాత్రం నాలుగవ స్థానంలో నిలవడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
ఈ ఏడాది IMDb ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్న ఆర్.ఆర్.ఆర్ గూగుల్ ట్రెండ్ లో మాత్రం ఫోర్త్ ప్లేస్ లో నిలిచింది. రణబీర్ కపూర్ అలియా జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా నేషనల్ వైడ్ గా భారీగా రిలీజైంది. ఈ ఏడాది బాలీవుడ్ కి గట్టి హిట్ ఇచ్చిన సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమా గురించి గూగుల్ లో బాగా సెర్చ్ చేసి ట్రెండ్ చేశారు.
గూగుల్ ట్రెండింగ్ లో 2 వ స్థానం లో ఉన్న సినిమా కె.జి.ఎఫ్ 2. చాప్టర్ 1 సూపర్ సెన్సేషన్ అవడంతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద మరింత క్రేజ్ ఏర్పడింది. అయితే ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ సినిమాని నిలబెట్టాడు. అందుకే కె.జి.ఎఫ్ 2 గురించి కూడా గూగుల్ లో ఒక రేంజ్ లో సెర్చింగ్ జరిగింది. కె.జి.ఎఫ్ 2 సినిమా రిలీజైన తర్వాత 3 వారాల పాటు గూగుల్ ట్రెండింగ్ లో ఉంది.
ఇక గూగుల్ ట్రెండ్స్ థర్డ్ ప్లేస్ ని లో ది కశ్మీర్ ఫైల్స్ దక్కించుకుంది. వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ సినిమా గురించి కూడా డిస్కషన్స్ జరిగాయి. ఇక ఈ లిస్ట్ లో 4వ స్థానంలో ఆర్.ఆర్.ఆర్ ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ క్రేజీ మల్టీస్టారర్ గురించి కూడా భారీగా చర్చ జరిగింది. గూగుల్ ట్రెండ్స్ లో ట్రిపుల్ ఆర్ నాల్గవ ప్లేస్ ని దక్కించుకుంది. ఇక రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి నటించిన కాంతార ఈ లిస్ట్ లో ఐదవ స్థానంలో నిలిచింది.













