లాస్ ఏంజెల్స్ లో అమెరికన్ స్లాంగ్ తో అదరగొట్టిన తారక్..
నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకున్నాడు. తాజాగా ” RRR ” సినిమాతో తనలో దాగిన అన్నిరకాల ప్రతిభల్ని ఒక్కొక్కటిగా తీస్తున్నాడు ఈ హీరో. ఈ సినిమాకి మలయాళం మినహా అన్ని భాషల్లోనూ ఎన్టీఆర్ సొంతంగా డబ్బింగ్ చెప్పారు. తర్వాత ” RRR ” జపాన్ రిలీజ్ సందర్భంగా ఏకంగా జపనీస్ భాషలోనే స్పీచ్ ఇచ్చి ఇటు ఆడియన్స్ ని అటు ఫాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసారు.
యంగ్ టైగర్ కి తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు జపానీస్ కూడా తెలుసు అనుకున్నారంతా. కానీ తారక్ లో అంతకు మించిన భాషా నైపుణ్యం దాగి ఉందని మరోసారి లాస్ ఎంజిల్స్ వేదికగా ప్రూవ్ అయింది. రీసెంట్ గా లాస్ ఏంజెల్స్ డీజీఏ థియేటర్లో ” RRR ” స్క్రీనింగ్ అయింది. ఈ షోకి ఎన్టీఆర్, రాజమౌళి సహా సినిమా టీం హాజరయ్యారు. ఇదే వేకదిపై తారక్ అమెరికన్ యాసతో అదరగొట్టేసారు.
అమెరికన్ వెస్ర్టన్ ప్రజల్ని తన భాషతో సర్ ప్రైజ్ చేసారు అంటే అతిశయోక్తి కాదు. తారక్ లో ఆ స్లాంగ్ చూసి మీడియా సైతం షాక్ అయింది. ఓ తెలుగు నటుడు, భారతీయుడు అమెరికన్ లాంగ్వేజ్ ని ఇరగదీస్తున్నాడుగా అంటూ అంతా ముక్కుమీద వేలేసుకుని సైలెంట్ అయిపోయారు. దీంతో తారక్ ముల్టీటాలెంటెడ్ అని అందరి నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఇక ప్రస్తుతరం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.













