ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన యంగ్ టైగర్ ఎన్టీర్

కరోనా నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని ఎలాగో చెపుతారు కానీ ఎన్టీర్ ఆర్ఆర్ఆర్ తరువాత చేయబోయే చిత్రాలు ప్రకటిచారు. అదీ గుడ్ న్యూస్, రెండున్నర ఏళ్ళ క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ మూవీ తో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, ప్రస్తుతం రాజమౌళి తో ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమా చేస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరొక హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా అత్యధిక ఖర్చుతో తెరకెక్కుతోంది. డి వి వి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చగా సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా అతి కొద్దిభాగం మాత్రమే షూటింగ్ బ్యాలన్స్ ఉంది. అయితే ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండడంతో మిగతా సినిమాల షూటింగ్స్ తో పాటు ఆర్ఆర్ఆర్ షూట్ కూడా ఇటీవల ఆగిపోయింది. ఇక మరోవైపు ఈ సినిమాకి సంబంధించి ఇతర పనులు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీని ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. కానీ తిరిగి సామాన్య పరిస్థితి నెలకుంటే గాని మరొక తేదీ ప్రకటించేలా లేరు. ఇటీవల ఎన్టీర్ కి కరోనా పాజిటివ్ రావడంతో ఇంటివద్దనే ప్రత్యేకంగా చికిత్స తీసుకుంటున్నారు.
అయితే నేడు ఆన్ లైన్ లో ఒక ప్రముఖ పత్రికకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితిని అందరం ధైర్యంగా ఎదుర్కొని తప్పకుండా మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడంతో పాటు అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని అన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే తప్పకుండా ఈ భారీ సినిమా అందరినీ ఆకట్టుకోవడం ఖాయం అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. అలానే తన తదుపరి సినిమాలపై ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఇప్పటికే 30వ చిత్రం గా కొరటాల మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాగా, అనంతరం తాను కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నానని, మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై నిర్మితం కానున్న ఆ మూవీకి సంబంధించి త్వరలో అధికారికంగా న్యూస్ రానున్నట్లు చెప్పారు ఎన్టీఆర్. దీనితో ఒక్కసారి ఎన్టీఆర్ అభిమానుల్లో జోష్ మొదలైంది. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా పై ఆయన ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా పట్టాలెక్కి ఆపై విడుదల తరువాత ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి… !!