ఆర్ఆర్ఆర్ ఒక్క రోజులో 200Cr! బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్లాస్టింగ్
గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా రేంజ్‌ను ప్రపంచానికి చాటిన డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్‌లతో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ తదితరులు నటించారు. భారీ తారాగణం.. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ మార్చి 25న రిలీజైంది. అంచనాలను మించేలా ఆర్ ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
1920 కాలంలోచరిత్రలో కలుసుకున్న దాఖలాలు లేని ఇద్దరు యోధులు కలుసుకుని బ్రిటీష్ వారిపై స్వాతంత్య్రం కోసం పోరాడితే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ కథాంశంతో ఆర్ ఆర్ఆర్ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు.ఇటు మెగా ఫ్యామిలీ హీరో.. అటు నందమూరి ఫ్యామిలీ హీరో .. ఇదొక రేర్ కాంబినేషన్. దీంతో పాటు రాజమౌళి వంటి క్రియేటివ్ డైరెక్టర్ కూడా యాడ్ కావడంతో ఆర్ ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ ఖాయమైంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వసూళ్ల వేట మొదలైంది. అసలు తొలి రోజున ఈ సినిమాకు వసూళ్లు ఎలా వస్తాయోనని అందరూ ఆసక్తిగా గమనించారు.
ఆర్ఆర్ఆర్ తొలి రోజు కలెక్షన్స్…
తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్
నైజాం – రూ. 23.30 కోట్లు
సీడెడ్ – రూ. 17.00 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 7.40 కోట్లు
వెస్ట్ గోదావరి – రూ. 5.93 కోట్లు
నెల్లూరు – రూ. 5.01 కోట్లు
బాలీవుడ్ – రూ. 18 కోట్ల గ్రాస్ వసూళ్లు
ఓవర్ సీస్ – 5 మిలియన్ డాలర్స్‌ను క్రాస్ చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఆర్ఆర్ఆర్ మూవీ రెండు వందల కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.













