రాజమౌళి చిత్రానికి ముహూర్తం
ముగ్గురు ఆర్ లు రాజమౌళి, రామ్‌చరణ్, రామారావు కలిసి చేస్తున్న చిత్రం త్వరలో సెట్‌పైకి ఎక్కనుంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ముగింపు దశకు చేరుకుంది. నటీనటులకు తగిన విధంగా శిక్షణకూడా ఇచ్చి వారిని పాత్రలనకుగుణంగా రాజమౌళి మార్చేశారు. ఈ మల్టీ స్టారర్ చిత్రాన్ని వచ్చే నెల 5న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. అదే రోజు రాజమౌళి ఈ చిత్రం ఏ నేపథ్యంలో సాగుతుందో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి అవసరమైన భారీ సెట్టింగ్స్‌ను ప్రముఖ స్టూడియోలో నిర్మించారు. ఈ చిత్రంలో ముగ్గురు నాయికలు వుంటారు. ఈ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. దానయ్య డీవీవీ నిర్మిస్తున్న ఈ చిత్రం 2020లో ప్రేక్షకులముందుకు రానుంది.













