ఆర్ఆర్ఆర్ నో పోస్ట్ పోన్.. కారణాలివే!
ఒక సినిమాకు మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతటి ప్రాముఖ్యత వహిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న బడ్జెట్ సినిమాలకు సైతం హాలీవుడ్ రేంజ్ బీజీఎం కావాలని తాపత్రయ పడుతుంటారు దర్శక నిర్మాతలు. అలాంటిది పాన్ ఇండియా సినిమాల కోసం ఆ తాపత్రయం ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీని కోసం దేశ విదేశాల నుంచి టాలెంటెడ్ మ్యూజిక్ డైరక్టర్లను ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకోవడంతో దీని రీరికార్డింగ్, మ్యూజిక్ పైనా రాజమౌళి ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి, రెస్ట్ లో ఉన్న రాజమౌళి, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని కంప్లీట్ చేస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరక్టర్, సింగల్, లిరిసిస్ట్ విశాల్ మిశ్రా, రాజమౌళితో ఉన్న పిక్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలో రాజమౌళి తో పాటు ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి కూడా ఉన్నారు. ఇవాళ స్టూడియాలో మ్యాజిక్ చేశాం. త్వరలోనే ఆఆర్ఆర్ వస్తుంది అని చేసిన ట్వీట్ తో రీసెంట్ ప్రచారాలకు చెక్ పెట్టినట్లు అయింది. దీంతో ఆర్ఆర్ఆర్ కు మ్యూజిక్, రీరికార్డింగ్ పనులు స్టార్ట్ అయ్యాయనే విషయం లో క్లారిటీ వచ్చేసింది.
ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ అనౌన్స్ చేసిన టైమ్ కు రిలీజ్ కాదని, ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారమవుతుంది. కానీ రాజమౌళి స్పీడ్ చూస్తుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను చెప్పిన తేదీకి రిలీజ్ చేయాలనే కసితో పని చేస్తున్నట్లు అర్థమవుతుంది. దానికి తోడు సినిమా రిలీజ్ డేట్ మారిందంటూ కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటనా చేయలేదు. సో… రాజమౌళి ఆర్ఆర్ఆర్ ను అక్టోబర్ 13న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్, రాజమౌళి ప్రధాన పాత్రల్లో నిర్మిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.













