ఎట్టకేలకు రెండు విడుదల తేదీలు ప్రకటించిన RRR టీం : ఈ సారైనా కరోనా కరుణిస్తుందో లేదో?
రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఆర్ఆర్ఆర్ సినీ ప్రియులు, ప్రేక్షకులు, అభిమానులు సహా ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా జనవరి 7న విడుదల కాాావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ఒమిక్రాన్, కోవిడ్ ప్రభావాలతో అన్నీ రాష్ట్రాలు థియేటర్స్‌ను మూసి వేస్తున్నాయి. దీంతో పాన్ ఇండియా రేంజ్లో తన సినిమా వసూళ్లు రాబట్టుకోవాలంటే థియేటర్స్ ఓపెన్‌లో ఉండాలని భావించిన ఆర్ఆర్ఆర్ దర్శక నిర్మాతలు.. సినిమాను వాయిదా వేశారు. ఆర్ఆర్ఆర్ టీమ్ సినిమా వాయిదాను ప్రకటించింది. తాజాగా ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ రెండు తేదీలు ప్రకటించారు. మొదటిది మార్చ్ 18, 2022, ఆ తేదీ కరోనా కారణంగా వీలుకాకపోతే మరోతేదీ ఏప్రిల్ 28, 2022 విడుదల అవుతుందని ప్రకటించారు.













