జపాన్ లో రజని రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్న RRR
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇనియా వండర్ RRR. టాలీవుడ్ టాప్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని సాధించి, బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది.
ఐదు భాషల్లో సుమారు 500 కోట్ల రూపాయలను వసూలు చేసింది RRR . ఓటీటీ లో నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్నప్పటి నుండి మరింత క్రేజ్ ని ఈ సినిమా సంపాదించుకుంది.
హాలీవుడ్ స్టార్స్, ఫిల్మ్ మేకర్స్ , విదేశీ సినీప్రియులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ నెట్టింట వైరల్ చేయడం విశేషం. వరల్డ్ వైడ్ గా రిలీజయ్యి , ఓటీటీ లో స్ట్రీమ్ అవుతున్నా కూడా ఈ సినిమా హవా ఎక్కడా తగ్గలేదని చెప్పాలి. ప్రస్తుతం జపాన్ లో ఈ మూవీ సంచలనాల్ని సృష్టిస్తుంది.
రీసెంట్ గా జపాన్ లో అత్యంత భారీ స్థాయిలో RRR మూవీ ని రిలీజ్ చేసారు. గతంలో ఏ తెలుగు సినిమా రిలీజ్ కాని రేంజ్ లో రికార్డు స్థాయి థియేటర్స్ లో విడుదలైన RRR అక్కడ దుమ్ములేపుతుంది. జపనీస్ ని తనదైన స్టైల్ లో మెస్మెరైజ్ చేస్తూ వసూళ్ల పంట పండిస్తోంది. ఈ రిలీజ్ కి జపాన్ లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసారు. అందుకు తగ్గట్టుగానే ఫలితం పొందుతున్నారు RRR టీమ్.
జపాన్ లో ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 362M (2.7 M) 22 కోట్లు రాబట్టింది. 27 సంవత్సరాల క్రితం తమిళ సూపర్ స్టార్ రజని నటించిన ‘ ముత్తు ‘ సినిమా 400M కలెక్ట్ చేసి భారతీయ సినిమాలో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత జపాన్ లో ఈ సినిమా చరిత్రని తిరగరాయబోతుంది. ఆ ఫీట్ కి RRR ఒక్క అడుగు దూరంలో ఉండడం విశేషం. త్వరలో RRR500 M మార్కుని దాటి ఇండియన్ సినిమాకి జపాన్ లో బెంజ్ మార్క్ సెట్ చేయబోతుంది.













