రౌడీ బాయ్స్ గుడ్ బాయ్స్ ఎలా అయ్యారు ?
తన కాలేజ్ లైఫ్‌లో జరిగిన ఘటనలతో కథ రాసుకుని, రౌడీ బాయ్స్ తీశాను అన్నారు దిల్ రాజు. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి ఆశిష్ రెడ్డి (శిరిష్ తనయుడు) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం రౌడీ బాయ్స్. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన చిత్రంలో విక్రమ్ మరో హీరో. శ్రీహర్ష కొనగంటి దర్శకత్వంలో అనిత సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో కలసి దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రౌడీ బాయ్స్ టైటిల్ సాంగ్‌ను వైజాగ్‌లో విడుదల చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నాలుగేళ్ల జర్నీ ఈ చిత్రం. రెండు కాలేజీల మధ్య జరుగుతుంది. రౌడీ బాయ్స్ గుడ్ బాయ్స్ ఎలా అయ్యారనేదే కథ. దసరాకు సినిమా రిలీజ్ చేయనున్నాం అన్నారు. శ్రీహర్ష, ఆశిష్, విక్రమ్, ఆదిత్య నిరంజన్, రోల్ రైడా పాల్గొన్నారు.













