కె.విశ్వనాథ్‌కు రోటరీ జీవిత సాఫల్య పురస్కారం
రోటరీ క్లబ్ ప్లాటినమ్ జూబ్లీ సందర్భంగా ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు 2016-17 సంవత్సరానికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు రోటరీ క్లబ్ జీవిత సాఫల్య పురస్కార కమిటీ చైర్మన్ డాక్టర్ ఎం.సి.దాస్, రోటరీ పౌరసంబంధాల విభాగం చైర్మన్ పులిపాక కృష్ణాజీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఈ నెల 17వ తేదీన ఉదయం 10 గంటలకు పురస్కార కార్యక్రమం జరుగుతుందన్నారు. కె.విశ్వనాథ్ చిత్రాల్లో కొన్ని నృత్య సన్ని వేశాలను, పాటలను ప్రదర్శిస్తారని తెలిపారు.













