కె. విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం
ఎన్నో గొప్ప చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ఇనుమడింపజేసిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను విజయవాడలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. రోటరీ క్లబ్ ప్లాటినమ్ జూబ్లీ సందర్భంగా 2016-17 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో రోటరీ క్లబ్ జీవిత సాఫల్య పురస్కార కమిటీ చైర్మన్ డాక్టర్ ఎంసి దాస్, రోటరీ పౌర సంబంధాల విభాగం చైర్మన్ పులిపాక కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్‌లో శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సినీ రంగానికి విశ్వనాథ్ చేసిన సేవలను కొనియాడారు.













