Roshan: రోషన్ కు మంచి ఛాన్స్ మిస్ అయిందే!
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్(Srikanth) కొడుకు రోషన్(Roshan) 2016లోనే నిర్మలా కాన్వెంట్(Nirmala Convent) సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన విషయం తెలిసందే. తర్వాత రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో పెళ్లి సందడి2(Pelli SandaD2) సినిమా చేసి మంచి క్రేజ్ అందుకున్నాడు. ఆ సినిమా బాగా ఆడకపోయినా రోషన్ లుక్స్, యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి.
ప్రస్తుతం రోషన్ ఛాంపిన్(Champion) అనే సినిమాలో నటిస్తున్నాడు. వైజయంతీ మూవీస్(Vyjayanthi Movies) బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. ఇది కాకుండా దీని కంటే ముందే రోషన్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) సినిమా వృషభ(Vrushabha)లో కీలకపాత్రలో నటిస్తున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే.
వృషభ 2024లో రిలీజవుతుందని చెప్పినా ఇప్పటివరకు రిలీజ్ అవకపోగా దాని గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజా సమాచారం ప్రకారం వృషభ ఆగిపోయినట్లు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్(Game Changer) ప్రమోషన్స్ లో భాగంగా రోషన్ తండ్రి శ్రీకాంత్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. వృషభ ఫస్ట్ షెడ్యూల్ లోనే ఆగిపోయిందని తెలిపాడు. మొత్తానికి రోషన్ కు వచ్చిన ఓ మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది.













