రోషగాడు టీజర్ వచ్చేసింది
విజయ్ ఆంథోని నటిస్తోన్న తాజా చిత్రం రోషగాడు. ఈ వైవిద్యమైన హీరో తొలిసారి పవర్‌పుల్ పొలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. గణేష్ దర్శకుడు. విజయ్ ఆంథోని ఫిలి కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ టీజర్‌ను గురువారం విడుదల చేశారు. విజయ్ ఆంథోని పవర్ పుల్ డైలాగ్స్‌తో పాటు, ఆయన స్వరపరచిన థీమ్ సాంగ్, యాక్షన్ పార్ట్ హైలైట్‌గా నిలిచాయి. నివేథా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తుండగా, స్టంట్ మాస్టర్ దీనా ఓ ప్రముఖ పాత్రలో అలరించనున్నారు. కంటెంట్‌కు ప్రాధాన్యత నిస్తూ, పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి మాటల, పాటలు: భాష్య శ్రీ, సంగీతం: విజయ్ ఆంథోని.













