RK Deeksha: తుమ్మల ప్రసన్న కుమార్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర నూతన పోస్టర్ లాంచ్
ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాణ దర్శకత్వంలో బిఎస్ రెడ్డి సమర్పణలో ఢీ జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్ గా, కిరణ్ హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం RK దీక్ష. తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీతం అందించగా మేఘన శ్రీను ఎడిటర్ గా పనిచేశారు. విడుదల దగ్గర పడుతున్న సందర్భంగా చిత్ర ప్రముఖుల చేతుల మీదగా ఈ చిత్ర నూతన పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర నిర్మాత మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత పితాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా చిత్ర ప్రెస్స్ మీట్ కు ఆహ్వానించిన వెంటనే వచ్చి మాకు సపోర్ట్ చేసిన ప్రసన్న కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్న ఎన్టీఆర్ గారు 50 సంవత్సరాల క్రితం చేసిన దీక్ష అనే టైటిల్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం గర్వంగా అనిపిస్తుంది. ఇప్పటికే ఇనేక సినిమాలు తీసాను. కాని కొన్ని సంవత్సరాల నుండి లీజు పద్ధతిలో సినిమాలు థియేటర్లలో నడపడం వల్ల చిన్న సినిమాలు, నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారు. దీనిని కచ్చితంగా అరికట్టే మార్గంలో ప్రసన్న కుమార్ గారు, తదితరులు ప్రయతిస్తున్నారు. చిన్న నిర్మాతలకు డిజిటల్ చార్జెస్ మరింత భారంగా మారింది. గతంలో ఇలా ఉండేది కాదు, ప్రస్తుతం దోపిడి పెరిగిపోయింది. ఇలాగే ముందుకు కొనసాగితే సినిమాలు చేయడం కష్టం అవుతుంది. ఇప్పటికి అయినా ఈ సినిమాతో డిజిటల్ ఛార్జ్ లు తగ్గించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో జవాన్లపై ఒక పాట ప్రత్యేకంగా ఉండబోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న నిర్మాతలు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సినిమాలో ఎన్నో అద్భుతమైన అంశాలు ఉంటాయి. నటీనటులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. దీక్ష సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
సమర్పకులు డి.ఎస్.రెడ్డి మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. దీక్ష అనే చిత్రంలో నటీనటులు ఎంతో ఉత్సాహంగా నటించి సినిమాలో చేశారు. మనిషికి ఉండే పట్టుదల, భక్తి వంటి అంశాలను తీసుకుని చేశారు. చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

నటుడు కిరణ్ మాట్లాడుతూ… “వేదికను అలంకరించిన అందరికీ నా నమస్కారం. దీక్ష చిత్రంలో హీరోగా నటించినందుకు గర్వంగా ఉంది. ఎన్నో విషయాలలో బిజీగా ఉండే రామకృష్ణ గారు అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఈ సినిమా చేయడం గొప్ప విషయం. మా సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ” అన్నారు.
నటి అక్సా ఖాన్ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఈరోజు మా దీక్ష చిత్ర పోస్టర్ లాంచ్ విడుదలకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. సినిమా కోసం ఎంతో కష్టపడి అందరం కలిసి పని చేశాము. నాకు అవకాశం ఇచ్చిన రామకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా ఎంతో మంది చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. నటీనటులు, సంకేత నిపుణులు అద్భుతంగా కష్టపడి ఈ సినిమా కోసం పని చేశారు.
నటి తులసి మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. నాకు సినిమాలో అవకాశం ఇచ్చిన రామకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సినిమాలో జవాన్ పాట ప్రత్యేకం. మా సినిమాను అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
గురు రాజ్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. నేను సినీ పరిశ్రమకు ఎప్పుడో వచ్చాను. ఇండస్ట్రీలో ప్రస్తుతం పరిస్థితులు గతంలో ఉన్నట్లు లేవు. చాలా కష్టమైన సమయం నడుస్తుంది. నేను సినిమాలు మొదలు పెట్టిన సమయంలో అడ్వాన్స్ డబ్బు ఇవ్వడానికి వచ్చేవారు. ఇప్పుడు అంతా మారిపోయింది. థియేటర్లకు అద్దెలు కట్టుకుని కూడా సినిమా నడపడం కష్టం అవుతుంది. నిర్మాతలు నష్టపోతున్నారు. కాబట్టి ఇకపై ఈ వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. దానికి కష్టపడుతున్న ప్రసన్న కుమార్ గారికి ధన్యవాదాలు. దీనికి నిర్మాతలు అంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. RK దీక్ష చిత్రం అందరికీ మంచి పేరుతో పాటు, కాసులు బాగా రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
సాయి వెంకట్ మాట్లాడుతూ… “ఎన్టీఆర్ గారి సినిమా పేరు మీదగా RK దీక్ష పేరు పెట్టడం ప్రత్యేకం. చిన్న సినిమాలతో ఇక్కడికి వచ్చి ఎంతోమంది పెద్దగా ఎదిగారు. వారు చిన్న సినిమాలకు, చిన్న నిర్మాతలకు సపోర్ట్ గా నిలవాలి. దానికి కృషి చేస్తున్న ప్రసన్న కుమార్ గారికి ధన్యవాదాలు. చిన్న సినిమాలకు ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అరికట్టాలి. వీటిని తట్టుకుని రామకృష్ణ గారు సేవ మార్గంలో ఒక ప్యాషన్ తో సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నటించిన అందరికీ ఆల్ ది బెస్ట్. RK దీక్ష చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
తెలుగు చిత్ర నిర్మాత మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ… “ఎన్టీఆర్ గారి చిత్ర పేరును తీసుకుని ఆయన ఆశయాలతో RK దీక్ష సినిమాను తీయడం జరిగింది. అటువంటి గొప్ప ఆలోచనతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నటి అక్సా ఖాన్ ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఉత్సాహంగా పాల్గొనడం హర్షించదగిన విషయం. ప్రస్తుతం చిన్న సినిమాల మనుగడకు చాలా కష్టంగా ఉంది. దాసరి నారాయణరావు గారు చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ, టికెట్ ధరలు తక్కువలో ఉండాలని కోరుకునేవాళ్ళు. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అందరూ బావుండాలి, అందులో మనం ఉండాలి అనుకోవాలి. డిజిటల్ ఎంతో అధిక ధరలతో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రామకృష్ణ గారు ఇటువంటి పరిస్థితులలో కూడా సినిమాలు చేయడం అభినందించదగిన విషయం. వివిధ రంగాల నుండి వచ్చిన వారు ఈ సినిమా కోసం పని చేశారు. గతంలో ఎన్టీఆర్, ఎఎన్ఆర్ వంటి వారు సినీ పరిశ్రమకు ఎంతో సపోర్ట్ చేశారు. అందరూ అలాగే చేయాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాలు బ్రతకాలి, అప్పుడే అందరూ బావుంటారు. రామారావు గారి ఆశీస్సులతో RK దీక్ష చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.






