దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
నా జీవితంలో ఎప్పుడు ఏం జరిగిందో అందరికి తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని అంటోంది మలైకా ఆరోరా. బాలీవుడ్ యువ కథానాయకుడు అర్జున్ కపూర్‌ని మలైకా అరోరా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళ్తుండటంతో ఇది నిజమేనని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దీని గురించి మలైకా స్పందిస్తూ వ్యక్తిగత ప్రశ్నలకు సంబంధించి నేను సమాధానం చెప్పను. దాని అర్థం నేను సిగ్గుపడుతున్నానని కాదు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం నాకు ఇబ్బందిగా ఉంటుంది. నా జీవితంలో ఎప్పుడు ఎం జరిగిందో అందరికి తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా. నా జీవితం అందమైనది, ఎంతో విలువైనది అని తెలిపింది. అయితే అర్జున్‌తో పెళ్ళి విషయాన్ని మాత్రం దాటేసింది.













