అప్పుడు నో చెప్పి ఇప్పుడు బాధ పడుతోందట?
ఎవరైనా సరే తెలియక తప్పులు చేస్తారు కానీ, తెలిసి తెలిసీ తప్పులు చేస్తారా? అంటే చేయరనే సమాధానం వస్తుంది కానీ, రీతువర్మ విషయంలో మాత్రం తెలిసి తప్పు చేసిందంటున్నారు సినీ జనాలు. గూఢచారి సినిమాలో ముందు రీతువర్మనే అనుకున్నారట. రీతు కూడా ఒకే చెప్పిందట. షూటింగ్ మొదలయ్యే సమయానికి ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. దాంతో ఆ క్యారెక్టర్లోకి శోభిత ధూళిపాల వచ్చింది. కట్ చేస్తే సినిమా విడుదల అవడమే కాకుండా సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పుడు సినిమా బాగా వచ్చిందంటూ సినీ ప్రముఖులు పొగుడుతుంటే, సినిమా అవకాశాన్ని పొగట్టుకున్నందుకు రీతూ ఇప్పుడు తీరిగ్గా బాధపడుతోందట. ఆ సినిమా తెలిసి తెలిసి మిస్ చేసుకున్నానని అనుకుంటోందట.













