తేజకు జోడీ కుదిరింది
హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జకు ఆ సినిమాతో మంచి క్రేజ్ ఏప్రడింది. ప్రస్తుతం హనుమాన్ కు సీక్వెల్ అయిన జై హనుమాన్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ లోపు తేజ ఓ భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ ను చేశాడన్న విషయం తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఇందులో మంచు మనోజ్ కూడా నెగిటివ్ రోల్ చేస్తున్నాడని సమాచారం. రూ. 40 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో తేజకు జోడీగా రితికా నాయక్ ఎంపికైనట్లు తెలుస్తోంది. రీసెంట్ గా హాయ్ నాన్న తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రితికా ఇంతకుముందు అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.
రితికా తెలుగులో ముందు ముందు భారీ సినిమాల్లో నటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందంతో పాటూ అభినయం, అలరించే సత్తా ఉన్న రితికా నాయక్, తేజతో కలిసి చేస్తున్న సినిమా హిట్ అయితే ముందుముందు స్టార్ హీరోలకు జోడీ కట్టే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి.













