రాజకీయాల్లోకి రానున్న జెలీనియా భర్త
సినీ నటి జెనీలియా భర్త, బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు సమాచారం. పలు సినిమాల్లో నటించిన రితీష్‌కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో కలిసి హౌస్‌పుల్ 4 సినిమాలో నటిస్తున్నాడు. రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలోని లాతూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన సన్నాహకాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై రితీష్ ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడే రితీష్ దేశ్ముక్ అన్న సంగతి తెలిసిందే.













