ఛత్రపతి శివాజీగా రితేష్ దేశ్ముఖ్
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి బుధవారం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శివాజీ జీవితం ఆధారంగా మూడు భాగాలు సినిమాను ప్రకటించారు బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ముఖ్. మరాఠీ చిత్రం సైరాట్ ఫేమ్ నాగ్రాజ్ మంజులే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అజయ్-అతుల్ సంగీతాన్ని సమాకూర్చనున్నారు. మొదటి భాగానికి శివాజీ, రెండో భాగానికి రాజా శివాజీ, మూడో భాగానికి ఛత్రపతి శివాజీ అని టైటిల్ ఫిక్స్ చేశారు. మొదటి భాగం 2021లో విడుదల కానుంది. శివాజీ జయంతికి ఈ సినిమాను ప్రకటించడం సంతోషంగా ఉంది అన్నారు చిత్ర బృదం. సుమారు నాలుగైదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు.













