త్వరలోనే అలియా భట్ పెళ్లి
బాలీవుడ్లో ప్రేమాయణాలు మామూలే. ప్రాంతీయ పరిశ్రమతో పోల్చుకుంటే, అక్కడ ప్రేమజంటలు లెక్కలేనన్ని. ప్రేమ పెళ్లిళ్లూ అంతే. ఆ జాబితాలో అలియా భట్ కూడా చేరుతోంది. వచ్చే నవంబర్‌లో ప్రేమ పెళ్లికి బాలీవుడ్ క్రేజీ భామ దీపికా పదుకొనె, రణ్‌వీర్‌సింగ్‌లు సిద్ధమవుతుంటే, దీపిక ఎక్స్ లవర్ రణవీర్ కపూర్ సైతం పెళ్లికి సిద్ధమయ్యాడు. ముందు దీపిక, తరువాత కత్రినా కైఫ్‌లతో ప్రేమాయణం సాగించిన రణవీర్, తాజాగా మరో హీరోయిన్ ప్రేమలో మునిగి తేలుతున్నాడట. ఆ క్రేజీ హీరోయిన్ ఎవరో కాదు ఆలియాభట్. బాలీవుడ్ ఎంట్రీతోనే క్రేజ్ తెచ్చుకునన ఆలియాతో రణ్వీర్ ప్రేమాయణం త్వరలోనే పెళ్లిపీటల వరకూ వెళ్లనుంది. తాజాగా ఆలియా పుట్టినరోజును ఆమె ఇంటి సభ్యులతో రణవీర్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. వేడుకలు చేయడమే కాదు, స్వయంగా కేకునూ తయారు చేశాడట. ఇప్పటికే వీరిద్దరి కుటుంబాల్లో పెళ్లి చర్చలూ జరిగాయని టాక్. మరి పెళ్లి ఎప్పుడన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.













