Rishab Shetty: కాంతార హీరోకు ఆ డైరెక్టర్ తో పని చేయాలనుందట
కాంతార(Kanthara) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అందుకున్న రిషబ్ శెట్టి(Rishab Shetty) తర్వాత కాంతార ప్రీక్వెల్(Kanthara Prequel) తో సర్ప్రైజ్ చేయనున్నాడు. తాజాగా ఆయన రానా దగ్గుబాటి షో(Rana Daggubati Show)లో పాల్గొన్నాడు. ఇంటర్వ్యూలకు భిన్నంగా రిషబ్ ఇంటికి వెళ్లి మరీ రానా ఈ ఇంటర్వ్యూ చేసుకొచ్చాడు. ఈ చిట్ చాట్ లో రిషబ్ లైఫ్ స్టైల్, సినిమాల సెలెక్షన్, పర్సనల్ లైఫ్ ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడారు.
అయితే ఈ సందర్భంగా రిషబ్ కు ఏ డైరెక్టర్ తో పని చేయాలనుందని రానా అడిగాడు. దానికి సమాధానంగా రిషబ్ తనకు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో పని చేయాలనుందని చెప్పాడు. అర్జున్ రెడ్డి(Arjun Reddy), యానిమల్(Animal) సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించిన సందీప్ సినిమాలు ఎంత బాగా కలెక్షన్లు సాధిస్తాయో అదే రేంజ్ లో విమర్శలు కూడా అందుకుంటాయి.
ఆ విమర్శలను పట్టించుకోకుండా సందీప్ తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. ఈ నేపథ్యంలో సందీప్ లాగా ఎవరూ ఆలోచించరని, అందుకే ఆయనతో సినిమా చేయాలనుందని, అతను తీసే ఏ సినిమాలోనైనా యాక్ట్ చేసేందుకు తాను రెడీగా ఉన్నానని రిషబ్ తెలిపాడు. రిషబ్ లాంటి స్టార్ ఇలా సందీప్ తో సినిమా చేయాలనుందని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తుంటే సందీప్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.













