Rishab Shetty: ఒక్క షో పడితే చాలనుకున్నా.. కానీ ఇప్పుడు

కన్నడ నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి(rishab shetty) కాంతార(kanthara) సినిమాతో ఏ స్థాయి సక్సెస్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా హిట్ అవడంతో దానికి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్1(kanthara chapter1) అంటూ తీసి, రీసెంట్ గా ఈ సినిమాను రిలీజ్ చేయగా, ఆ సినిమాకు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం కాంతార1 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది.
కాంతార చాప్టర్1 కు మొదటి నుంచే మంచి టాక్ రావడంతో అన్ని ఏరియాల్లోని ఈవెనింగ్ షో లకు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. అయితే కాంతార1 ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడంపై రిషబ్ ఆనందాన్ని వెల్లడిస్తూ ఓ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. 2016లో తాను చేసిన సినిమా ఒక్క షో పడటం కోసం తానెంతో కష్టపడ్డానని తన జర్నీని గుర్తు చేసుకున్నాడు.
ఒక్క షో పడితే చాలనుకునే స్థాయి నుంచి ఇప్పుడు 5000కు పైగా థియేటర్లలో హౌస్ ఫుల్స్ పడటం వరకు తన జర్నీ ఎన్నో కష్టాలుతో కూడుకుందని, దీనికి భగవంతుని దయతో పాటూ ఆడియన్స్ ప్రేమాభిమానాలు కూడా ఉన్నాయని, ఎప్పటికీ వాటిని మర్చిపోలేనని, అందరూ ఆదరించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని రిషబ్ తన పోస్టులో రాసుకొచ్చాడు.