రైఫిల్ ఆడియో రిలీజ్
వి.ఎస్.ఆర్ ప్రొడక్షన్స్ రైఫిల్ మూవీ ఆడియో లాంచ్ జరిగింది. సుమన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. భాను చందర్ ప్రధాన పాత్రలో కిరణ్, సిరి చందన కృష్ణన్ హీరో హీరోయిన్లుగా నటించి ఈ చిత్ర ఆడియో ఫంక్షన్లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. భాను చందర్ మాట్లాడుతూ రైఫిల్ సినిమాలో నాది మిలిటరీ పాత్ర అనగానే వెంటనే ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు అన్నారు. హీరో కిరణ్ మాట్లాడుతూ నాకు ఈ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.. సుమన్‌గారు మా సినిమా ఆడియోకు రావడం సంతోషం. షూటింగ్ సమయంలో భాను చందర్‌గారు నన్ను ఎంకరేజ్ చేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది అన్నారు.













