రిచా పెళ్లి పీటలెక్కింది
మిర్చి నాయిక రిచా గంగోపాధ్యయ పెళ్లి పీటలెక్కింది. తెలుగుతో పాటు తమిళంలోనూ మెరిసిన ఈమె కొన్నేళ్ల కిందట సినిమాలకి గుడ్ బై చెప్పి అమెరికా వెళ్లిపోయింది. అక్కడే ఉన్నత విద్యని అభ్యసిస్తూ, సహ విద్యార్థి అయిన జో అనే కుర్రాడితో ప్రేమలో పడింది. ఇద్దరికీ ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం జరిగింది. ఇటీవలే రిచా, జో వివాహ బంధంతో ఒక్కటైనట్టు తెలుస్తోంది. బెంగాలీ కుటుంబానికి చెందిన రిచా వివాహం హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం జరిగినట్టు సమాచారం. వీరి పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. లీడర్ తో తెలుగు తెరకు పరిచయమై.. నాగవల్లి, మిరపకాయ్, సారొచ్చారు తదితర చిత్రాల్లో మెరిసింది రిచా.













