సినిమాలకు రిచా గుడ్ బై
హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ సినిమాలకు గుడ్ బై చెప్పారు. లీడర్ చిత్రంలో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తరువాత మిర్చి, సారొచ్చారు. మిరపకాయ్, నాగవల్లి తదితర చిత్రాల్లో నటించారు. ఆమె తెలుగులో నటించిన ఆఖరి చిత్రం భాయ్. 2013లో వచ్చిన ఈ చిత్రంలో ఆమె నాగార్జునతో జత కట్టారు. ఆపై ఆమె ఇప్పటి వరకు ఒక్క సినిమాలోనూ నటించలేదు. దీనిపై ఆమె అభిమానులు మీరిక సినిమాల్లో నటించరా అంటూ ట్వీట్ చేస్తున్నారు. దీనిపై రీచా స్పందించారు. తాను సినిమాలను వదిలేసి ఐదేళ్లు అవుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు తాను కొత్త జీవితంలోకి అడుగుపెట్టాని, అందులో నటన అనే అంశమే లేదని ఆమె సృష్టం చేశారు.













