క్లాస్ మేట్ తో రిచా గంగోపాధ్యాయ్ నిశ్చితార్థం
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అమెరికన్ భామ రిచా గంగోపాధ్యాయ్. యూఎస్ లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఎంబీఏ మేనేజ్ మెంట్ కోర్సు చేసేందుకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన క్లాస్ మేట్ జోయ్ తో నిశ్చితార్థం పూర్తయినట్లు రిచా గంగోపాధ్యాయ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. జోయ్ తో నాకు నిశ్చితార్థం అయింది. బిజినెస్ స్కూల్ లో జోయ్ ను కలిశాను. రెండు అద్బుతమైన సంవత్సరాలు బిజినెస్ స్కూల్ లో గడిసాయి. నా కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేసింది రిచా గంగోపాధ్యాయ్. అయితే జోయ్, రిచా పెళ్లి తేదీ ఎపుడు అనేది మాత్రం చెప్పలేదు.













