షకీలా బయోపిక్ లో బాలీవుడ్ బ్యూటీ
ఒకప్పుడు దక్షిణాది యూత్‌ను ఉర్రూతలూగించిన శృంగార తార షకీలా జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చద్దా ఇందులో షకీలా పాత్రను పోషిస్తోంది. అయితే ఈ చిత్రం కోసం స్వయంగా షకీలా తన జీవితంలోని పలు విషయాలు, చీకటి కోణాలను దర్శకుడు ఇంద్రజిత్ లోకేష్‌కు తెలియజేయడం జరిగింది. ఇక షకీలా గురించి ఎన్నో తెలియని విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం రిచా చద్దా బెల్లీ డాన్స్‌లో శిక్షణ తీసుకుంటోందట. ముంబయికి చెందని ప్రముఖ బెల్లీ డాన్సర్ వద్ద ఆమె ఈ నృత్యాన్ని నేర్చుకుంటోంది. షకీలా మూవీకి తాను నేర్చుకుంటున్న బెల్లీ డాన్స్ చాలా ఉపయోగపడుతుందని అంటోంది రిచా. అయితే షకీలా మూవీలో బెల్లీ డాన్స్ ఏంటని అంతా షాక్ అవుతున్నారు. కథానుసారంగా చిత్రంలో డ్యూయెట్స్, కమర్షియల్ సాంగ్స్ ఉండవట. అందుకే ఈ సినిమా ప్రమోషన్ కోసం ఒక సాంగ్‌ను ప్లాన్ చేశారు. ఆ ప్రమోషనల్ సాంగ్‌లో రిచా చద్దా బెల్లీ డాన్స్ చేస్తున్నట్టుగా తెలిసింది.













