అరెస్ట్ చేయండి..బెయిల్ అడగను: రియా
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ అనుమానాస్పద మరణం కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి చుట్టూ వల బిగుసుకుంటోంది. ఆదివారం రియాను, ఆమె సోదరుడు షోవిక్ని నేషనల్ క్రైమ్ బ్యూరో విచారిస్తోంది. వీరిద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించే ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం ఆదివారం సాయంత్రమే రియాను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో తీవ్రమైన క్రిమినల్ కోణాలున్నట్టు ఎన్సిబి అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపధ్యంలో తాను అరెస్టవుతానంటూ వస్తున్న వార్తలపై రియా స్పందించింది. తాను అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది. తాను ముందస్తు బెయిల్ కోసం కూడా అడగనని అరెస్ట్ అవడానికే సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేసింది. ప్రేమించడం నేరం కాదని ప్రేమ కోసం ఎంత కష్టమైనా భరిస్తానని రియా కన్నీళ్లతో అంటోంది.













