రియా చక్రవర్తి అరెస్ట్…
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మరణం కేసులో అతని ప్రియురాలు, నటి రియా చక్రవర్తి అరెస్ట్ అయినట్టు సమాచారం. గత నాలుగు రోజులుగా ఆమెను విచారిస్తున్న నేషనల్ క్రైమ్ బ్యూరో అధికారులు మంగళవారం మధ్యాహ్న సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారని, సాయంత్రానికి ఆమె అరెస్ట్‌ను ప్రకటించవచ్చునని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె సోదరుడు షోవిక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రియా కోరిక మేరకే తాను సుశాంత్‌కు డ్రగ్స్ సరఫరా చేశానని షోవిక్ అంగీకరించడంతో డ్రగ్స్ కేసులో రియా అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. సోదరుడి వాంగ్మూలం మేరకు అరెస్ట్ కావడానికి ముందు రియా పలు సంచలన విషయాలు ఎన్‌సిబి అధికారులతో వెల్లడించినట్టు తెలిసింది. ఆమె విచారణలో వెల్లడించిన అంశాలపైస కూడా అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. అరెస్ట్ అనంతరం రియా చక్రవర్తని కస్టడీకి కోరే అవకాశం ఉందని సమాచారం.













