పేర్లు చెప్పిన రియా..బాలీవుడ్ లో భయం భయం
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మరణానంతరం ఒక్కటొక్కటిగా మారుతూ వచ్చిన పరిణామాలు బాలీవుడ్ మొత్తాన్ని ఒక కుదుపు కుదిపే దిశగా కదులుతున్నాయి. సుశాంత్ కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్టయినట్టు వార్తలు వస్తున్న నేపధ్యంతో పాటు నేషనల్ క్రైమ్ బ్యూరో అధికారుల ముందు రియా వెల్లడించిన పలు విషయాలపై వస్తున్న ఊహాగానాలతో బాలీవుడ్ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని సమాచారం. సుశాంత్‌తో సన్నిహితంగా ఉండే పలువురు హీరోల, సినీ ప్రముఖుల పేర్లు రియా అధికారులకు వెల్లడించినట్టు తెలుస్తోంది.
రియా చెప్పిన పేర్లకు సంబంధించి ప్రాధమిక ఆధారాలు ఉన్న దాదాపు 25 మందికి ఎన్‌సిబి అధికారులు నేడో రేపో నోటీసులు జారీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో పలువురు బాలీవుడ్ స్టార్స్ తమ తమ స్థాయిలో తప్పించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం. దీని కోసం తమకు తెలిసిన రాజకీయ నేతలతో సంప్రదింపులకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే బాలీవుడ్ నటి కంగాన రనౌత్ సైతం డ్రగ్స్‌కు బానిసలైన పలువురు స్టార్ హీరోలు, నటుల పేర్లు బాహాటంగానే చెప్పడం తెలిసిందే.













