బాలీవుడ్ డైరెక్ట్ సినిమాలకంటే సౌత్ డబ్బింగ్ చిత్రాలు KGF 2, బాహుబలి 2 ల కలెక్షన్స్ ఎందుకు ఎక్కువ వచ్చాయి చెప్మా? :ఆర్జీవీ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, బాలీవుడ్ సినిమా చరిత్రలో డబ్బింగ్ సినిమాలుగా అక్కడ విడుదలై కె.జి.యఫ్ 2, బాహుబలి 2 తొలి రోజున హైయెస్ట్ రికార్డ్ వసూళ్లను సాధించాయని చెబుతూ ట్వీట్ చేయడం విశేషం. ఆర్జీవీ ఎవరినైనా కామెంట్ చేయాలనుకుంటే విమర్శనాత్మకంగా కామెంట్ చేస్తారు. మీకెందుకండి అని అంటే.. నా ఇష్టం అంటారు. సాధారణంగా మెగా ఫ్యామిలీ హీరోలను టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేసే ఆర్జీవీ ఇప్పుడు తన ఫోకస్‌ను మార్చుకున్నట్లే కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన తన గిల్లుడు వ్యవహారాన్ని బాలీవుడ్‌పై తిప్పారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ తాజాగా చేసిన ట్వీట్. రీసెంట్ ట్వీట్లో వర్మ.. ఎంటైర్ బాలీవుడ్‌ను దక్షిణాది సినిమాలతో పోల్చి కామెంట్ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
‘‘కన్నడ నుంచి హిందీలోకి డబ్ అయిన KGF 2, తెలుగు నుంచి హిందీలోకి డబ్ అయిన బాహుబలి 2 సినిమాలు హిందీ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలుగా ఎలా నిలిచాయా? అని హిందీ సినిమా అలియాస్ బాలీవుడ్ ఆలోచనలో పడి ఉంటుంది’’ అని ఆర్జీవీ ట్వీట్ చేయడంతో పాటు తొలిరోజున వసూళ్లు సాధించిన టాప్ టెన్ సినిమాల లిస్టులను పెట్టారు. అందులో త్రిబుల్ ఆర్ ని మెన్షన్ చేయకపోవడం విశేషం. ఆర్జీవీ పోస్ట్ చేసిన టాప్ టెన్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలను గమనిస్తే.. తొలి స్థానంలో KGF 2కి రూ.38-39 కోట్లు రాబోతున్నట్లు, బాహుబలి 2 రూ.37.53 కోట్లు సాధించాయని తెలుస్తుంది. మిగిలిన అన్ని స్థానాల్లో హిందీ చిత్రాలున్నాయి. యష్ హీరోగా నటించిన చిత్రం KGF 2 . ప్రశాంత్ నీల్ దర్శకుడు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను సాధిస్తోంది.
https://twitter.com/RGVzoomin/













