తెలంగాణ స్లాంగ్‌లో నాని డైలాగ్స్!
హీరో నాని తను చేసే ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని కోరుకుంటాడు. దానికి తగ్గట్టుగానే కథలను ఎంపిక చేసుకుంటాడు. నాని, సుధీర్‌బాబులతో మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన `వి` విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కాక శివ నిర్వాణ దర్శక్వంలో `టక్ జగదీష్` అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కాక రాహుల్ సంకృత్యాన్, వివేక్ ఆత్రేయతో కూడా సినిమాలు చేయనున్నాడు.
సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్‌తో ఓ సినిమా కమిట్ అయ్యాడు నాని. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ కొత్త విషయం బయటికి వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడిగా కనిపిస్తాడట. తెలంగాణ స్లాంగ్‌లో నాని డైలాగ్స్ చెప్పబోతున్నాడు. గతంలో `కృష్ణార్జున యుద్ధం` చిత్రంలో రాయలసీమ యాసలో మాట్లాడి అందర్నీ అలరించిన నాని ఇప్పుడు నిర్మాణంలో ఉన్న `టక్ జగదీష్` గోదావరి జిల్లాల యాసలో మాట్లాడబోతున్నాడు. తాజాగా చేయబోయే సినిమాలో తెలంగాణ స్లాంగ్‌లో నాని చెప్పబోయే డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.













