తేజ సజ్జ సినిమాకు రిపేర్లు
ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ తనకు మరో ఛాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా తాలూకు షూటింగ్ గతేడాది నవంబర్ లోపే కొంత భాగం చేశారు. సినిమాకు మిరాయ్ అనే టైటిల్ పెట్టారని ప్రచారం కూడా జరిగింది. కానీ చిత్ర బృందం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు.
తేజ సజ్జ, దుల్కర్ సల్మాన్ ప్రధాన్ పాత్రల్లో మంచు మనోజ్ విలన్ గా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతుందని అప్పట్లో బాగానే టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు హనుమాన్ తర్వాత తేజ సజ్జ మార్కెట్ పెరగడంతో అతను చేయబోయే తర్వాతి సినిమాలకు సంబంధించి మరోసారి రివ్యూ చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.
అందులో భాగంగానే ఈ సినిమాకు కొన్ని రిపేర్లు చేస్తున్నారని తెలుస్తోంది. తేజ పాత్రను పెంచి దానికి అనుగుణంగా ఎలాంటి మార్పులు చేయాలనేదానిపై టీమ్ వర్క్ చేస్తుందట. అందుకే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మళ్లీ ఏప్రిల్ లేదా మే నుంచి రీస్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. హనుమాన్ తర్వాత వచ్చిన మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని తేజ తను తర్వాత చేయబోయే ప్రతీ సినిమా విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.













