రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన రేణు
గత కొన్ని రోజులుగా తన రెండో పెళ్లికి సంబంధించి హాట్ టాపిక్‌గా మారిన రేణు దేశాయ్ ఇప్పుడు కొత్త వార్తతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బద్రీ, జానీ వంటి చిత్రాలలో పవన్ సరసన కథానాయికగా నటించిన రేణూ పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైంది. దర్శకురాలిగా, ఎడిటర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నిర్మాతగా పలు విభాగాలలో పని చేసింది రేణూ. ఈ మధ్య తెలుగులో ఓ రియాలిటీ షోకి జడ్జిగా కూడా వ్యవహరించింది. అయితే ఇప్పుడు వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రేణు దేశాయ్ సిద్ధమైందని చెబుతున్నారు. ఇటీవల గోవాలో నిశ్చితార్థం జరుపుకున్న రేణు అతి త్వరలో పెళ్లి కూడా చేసుకోనుంది.
వివాహం తర్వాత ఓ తెలుగు సినిమాలో ఆమె ముఖ్య పాత్రలో కనిపించనుందని అంటున్నారు. ఓ యువ హీరోకి వదిన పాత్రలో రేణు మెరుస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పెళ్లి చేసుకొని విదేశాలకి వెళుతుందనుకున్న రేణు మళ్ళీ కెరీర్ పరంగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టనుందనే వార్త అభిమానులకి ఎక్కడలేని ఆనందాన్ని అందిస్తుంది. కొత్త భాగస్వామితో పాటు కొత్త సినీ కెరీర్ మొదలు పెట్టనున్న రేణుకి ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.













