సినిమాల్లోకి రేణు రీఎంట్రీ
మోడలింగ్ నుంచి సినీ రంగం లోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు రేణు దేశాయ్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె పూణేలో స్థిరపడ్డారు. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఆమె అపుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తున్నారు. అయితే ఓ అభిమాని నుంచి రేణుకు ఊహించని ప్రశ్న ఎదురైంది. సినిమాల్లో రీఎంట్రీ గురించి అడుగుతూ.. ప్రభాస్, మహేష్‌లకు తల్లిగా నటించే అవకాశం వస్తే చేస్తారా అని అడిగాడు. దీనికి రేణు దేశాయ్ సమాధానమిస్తూ.. హీరోల చిన్నతనంలోని పాత్రలకు తల్లి పాత్ర చేయడానికి సిద్ధమేనని చెప్పారు. ఇక ఏ దర్శకుడైన తనను వృద్ధాప్య ఛాయలున్న పాత్రలో చూపించగలరనుకుంటే మహేష్ లాంటి స్టార్లకు తల్లిగా నటిస్తానని చెప్పారు. ఇక టాలీవుడ్లో ఏదైనా మంచి పాత్ర వస్తే తప్పకుండా చేస్తానని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రేణుదేశాయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల్లోకి రేణు రీఎంట్రీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమె ఏ సినిమాతో రీ ఎంట్రీనిస్తుందో చూడాలి.













