హేమలతా లవణంగా రేణూదేశాయ్!
నటి రేణూ దేశాయ్ మరాఠీలో ఇష్క్ వాలా లవ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించాక కొంత గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం తెలుగులో చిత్రాన్ని చేయడానికి సంసిద్ధం వ్యక్తం చేసింది. తను నటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఓ సినిమాకు సంతకం చేశానని మీకు చెప్పడం సంతోషంగా ఉంది. నేడు చాలా ప్రత్యేకమైన పాత్రను పోషించబోతున్నా. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో సామాజిక వేత్త, రచయిత హేమలత లవణంగారి పాత్రలో నటించబోతున్నా. వ్యక్తిగతంగా నాకు ఆమెపై చాలా అభిమానం ఉంది. వెండితెరపై ఆమె పాత్రను పోషించడం గౌరవంగా భావిస్తున్నా. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలోనే చెబుతానని వెల్లడించింది. మరో సినిమాలో కూడా నటించనున్నానని ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తానని పేర్కొంది. మరో ముఖ్యమైన ప్రాజెక్టుకు కూడా సంతకం చేశా. వచ్చే వారం ఆ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నా అని రేణు పేర్కొన్నారు. హేమలత లవణం అంటరానితనం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. తన భర్త లవణంతో కలిసి సంస్కార్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా పనిచేశారు.













